Yeduta Nilichindi Choodu – ఏడుత నిలిచింది చూడు

Yeduta Nilichindi Choodu from Vaana

Song: Yeduta Nilichindi Choodu – ఏడుత నిలిచింది చూడు
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: Karthik
Music: Kamalakar
Movie Name: Vaana

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో

ప్రాణమంత మీటుతుంటే
వాన వీణలా

ఎదుట నిలిచింది చూడు

నిజంలాంటి ఈ స్వప్నం
ఎలా పట్టి ఆపాలి
కలే అయితే ఆ నిజం
ఎలా తట్టుకోవాలీ

అవునో కాదో
అడగకంది నా మౌనం
చెలివో శిలవో
తెలియకుంది నీ రూపం

చెలిమి బంధం అల్లుకుందే
జన్మ ఖైదులా

ఎదుట నిలిచింది చూడు

నిన్నే చేరుకోలేకా
ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక
విసుక్కుంది నా కేక

నీదో కాదో
వ్రాసున్న చిరునామా
ఉందో లేదో
ఆ చోట నా ప్రేమా

వరంలాంటి శాపమేదో
సొంతమైందిలా

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో

ప్రాణమంత మీటుతుంటే
వాన వీణలా

ఎదుట నిలిచింది చూడు

Click for More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top