Vachindamma – వచ్చిందమ్మా

Vachindamma from Geetha Govindam

Song: Vachindamma – వచ్చిందమ్మా
Lyrics: Sri Mani
Singer: Sid Sriram
Music: Gopi Sundar

Movie Name: Geetha Govindam

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా
అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా
అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల

దేవా దేవుడే పంపగా
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులు
మా అమ్మలా మాకోసం మల్లి లాలి పడినంత

వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏదో ఋతువై బొమ్మ
హారతి పళ్లెం హాయిగా నవ్వే వదినమ్మ
వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లోనే నెలవంక ఇక నువ్వమ్మ

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా

సంప్రదాయాన్ని సుధాపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి
సంప్రదాయాన్ని సుధాపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి

ఎద చెప్పుడు కదిరి మేడలో తాళవన
ప్రతి నిమిషం మాయితూనే పెంచేయన
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన
కలలన్ని కాటుకళై చదివేనా
చిన్ని నవ్వు చాలా నంగా నచ్చి కూన
ముల్లోకాలు మింగే మూతి ముడుపు దాన
ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళలోనో
నిద్ర చెరిపేస్తావ్వే అర్ధ రాతిరి ఐన

వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏదో ఋతువై బొమ్మ
నా ఊహల్లొన్న ఊరేగింది నువ్వమ్మ
వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ
నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా

ఈకాంతాలన్నీ ఏ కాంతం లేక
ఈకరువే పెట్టాయి ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వగాతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక
కష్టం నష్టం మనే సొంత వాళ్ళు రాక
కన్నీరు అన్తరాయే నిలువ నీడ లేక

ఇంత అదృష్టం నేదేఅంటూ
పగబట్టిందే నాపై జగమంతా

నచ్చిందమ్మ నచ్చిందమ్మ నచ్చిందమ్మ జన్మ
నీలో సగమై బ్రతికే భాగ్యము నాదమ్మ
మెచ్చిందమ్మ మెచ్చిందమ్మ నుదుటున కుంకుమ బొమ్మ
ఓ వెయ్యేళ్ళు ఆయుషంటూ దీవించిందమ్మా

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా
అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా
అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల

Click for More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top