Oke Oka Mata – ఒకే ఒక మాట

Oke Oka Mata from Chakram Movie

Song : Oke Oka Mata – ఒకే ఒక మాట
Lyrics : Sirivennela Seetharama Sastry
Singer : Chakri
Music : Chakri
Movie Name: Chakram

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమని
నా దారి నీ వలపని
నా చూపు నీ నవ్వని
నా ఊపిరే నువ్వని
నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా

నేను అని లేను అని చెబితే ఎం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లే పోమంటావు

నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని

నీ కంటిమైమరుపులో నను పోల్చుకొంటానని
తలా ఆంచి నీ గుండెపై నా పేరు వింటానని
నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం

నువ్వు రాకముందు జీవితం గురుతైనా లేదని
నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోనని

ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని
ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని
నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా

నా పేరు నీ ప్రేమని
నా దారి నీ వలపని
నా చూపు నీ నవ్వని
నా ఊపిరే నువ్వని
నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా

Click for More

1 thought on “Oke Oka Mata – ఒకే ఒక మాట”

  1. Pingback: Bommali – బొమ్మాలి - Telugupaatalu.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top