Cheppamma Cheppamma – చెప్పమ్మ చెప్పమ్మ

Cheppamma Cheppamma Song Lyrics Murari Movie

Song : Cheppamma Cheppamma – చెప్పమ్మ చెప్పమ్మ
Lyrics :  Sirivennela Seetharama Sastry
Singer : K.S. Chitra
Music : Mani Sharma
Movie Name: Murari

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
నువ్వంటె మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం

వెంట తరుముతున్నవేంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి ఎటు చూసిన
చెంప గిల్లి పొతావేంటి గాలి వేలితోన
అంత గొడవపెడతావేంటి నిద్దరోతు ఉన్న
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్న
ఒంటిగ ఉందనీవెంటి ఒక్క నిముషమైన
ఇదేం అల్లరి భరించేదేల అంటూ నిన్నేల కసరనూ
నువ్వేంచేసినా బాగుంటుందనే నిజం నీకెలా చెప్పనూ

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైన
ఏడిపించబుద్దౌతుంది ఎట్టాగైన
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపొతు ఉన్న
లేనిపొనీ ఉక్రోషం తో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా పోజుగ ఎటో నువ్వు చూస్తూ ఉన్న
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా అయ్యో రామా

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
నువ్వంటె మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ I Love You చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
I Love You I Love You
I Love You I Love You
I Love You I Love You

Click for More

1 thought on “Cheppamma Cheppamma – చెప్పమ్మ చెప్పమ్మ”

  1. Pingback: Alanati Ramachandrikanninta saati – అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి - Telugupaatalu.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top