Ade Neevu Ade Nenu – అదే నీవు అదే నేను

Ade Neevu Ade Nenu

Song : Ade Neevu Ade Nenu – అదే నీవు అదే నేను
Lyrics :  Aatreya
Singer : S. P. Balasubrahmanyam
Music : Illayaraja
Movie Name: Abhinandana

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా (2)

కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము
కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము
గువ్వా గువ్వా కౌగిలిలో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదిలేని గానము
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
అదే బాసగా అదే ఆశగా
అదే బాసగా అదే ఆశగా
ఎన్నినాళ్ళీ నిన్న పాటే పాడను

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

Click for More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top