Raayini Matram – రాయిని మాత్రం

Song : Raayini Matram – రాయిని మాత్రం
Lyrics : Vennelakanti
Singer : Hariharan
Music : Himesh Reshammiya
Movie Name: Dhasaavathaaram
ఓం నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
హరిణి తలచు నా హృదయం నేడు
హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవునెం చేస్తారు ఆ యమా కింకరుడు
నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే
వీర శైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవం మోగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పడమట సూర్యుడు పొడవడులే
రాజ్య లక్ష్మి నాధుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య రాజులే
రాజాలకు రాజు ఈ రంగ రాజనే
నీటి లోన ముంచి నంత నీతి చావదు లే
గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే
నీటి లోన ముంచినంత నీతి చావదు లే
గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే
దివ్వెల నార్పె సుడి గాలి
వెన్నెల వెలుగులను ఆర్పేనా
నేలను ముంచే జడి వాన
ఆకాశాన్నే తడిపేన
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట
రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
Click for More