Jamurathiri – జామురాతిరి

Jamurathiri Song from Kshana Kshanam Movie

Song : Jamurathiri – జామురాతిరి
Lyrics :  Sirivennela Seetharama Sastry
Singers : S.P. Balasubramanyam, K.S. Chitra
Music :  M M Keeravani
Movie Name: Kshana Kshanam

జామురాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మ
జారనీయకే కలా

వయ్యారి వాలు కళ్ళలోన
వరాల వెండి పూల వాన
స్వరాల ఊయలూగు వేళ

జామురాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా

కుహు కుహు సరాగాలె శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా

కునుకు రాక బుట్ట బొమ్మ
గుబులు గుందని
వనము లేచి వద్ద కొచ్చి
నిద్ర పుచ్చని

జామురాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా

మనసులో భయాలన్నీ మరిచిపో
వగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉష తీరం వెతుకుతూ
నిదరతో నిశారానే నడిచిపో

చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మా ఉదయ కాంతికి

జామురాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికొమ్మ
జారనీయకే కలా

వయ్యారి వాలు కళ్ళలోన
మ్మ్ హ్మ్మ్ మ్మ్ హ్మ్మ్ హా హ
స్వరాల ఊయలూగు వేళ

హహ హహహ తాన నాన
మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ ఆహ్ హ
తానతననన తాని నాన
మ్మ్మ్మ్మ్ అః మ్మ్ మ్మ్ మ్మ్ అః

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top