Aakasa Ganga – ఆకాశ గంగ

Aakasa Ganga – ఆకాశ గంగ

Aakasa Ganga from Vaana

Song: Aakasa Ganga – ఆకాశ గంగ
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: Karthik
Music: Kamalakar

Movie Name: Vaana


ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్న నిన్నాపగా

ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే

చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దాడి కనుమరుగైన
నా గుండె లయలో విన్న నీ అలికిడి

ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా

ఈ పూట వినకున్న నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్న నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా

మనసుని నీతో పంపిస్తున్న
నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా
ఆ జాడలన్ని వెతికి నిన్ను చేరన

ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్న నిన్నాపగా

ఆకాశ గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా

Click for More

SV

Related Posts

Swing Zara – స్వింగ్ జర 

Swing Zara – స్వింగ్ జర  Song : Swing Zara – స్వింగ్ జర Lyrics : Rama Jogayya SastrySinger : Neha Basin, Devi Sri PrasadMusic : Devi Sri PrasadMovie Name: Jai Lava Kusa స్వింగ్…

Yenti Yenti – ఏంటి ఏంటి

Yenti Yenti – ఏంటి ఏంటి Song : Yenti Yenti – ఏంటి ఏంటిLyrics : Sri ManiSinger : ChinmayiMusic : Gopi SundarMovie Name: Geetha Govindam అక్షరం చదవకుండాపుస్తకం పేరు పెటేసానాఅద్భుతం ఎదుటనున్నచూపు తిప్పేసాన అంగుళం నడవకుండాప్రయాణమే చేదు పొమ్మన్నానాఅమృతం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *