Lalitha Priya Kamalam – లలిత ప్రియ కమలం

Lalitha Priya Kamalam Song from Rudraveena

Song : Lalitha Priya Kamalam – లలిత ప్రియ కమలం
Lyrics :  Sirivennela Seetharama Sastry
Singer : Yesudas, Chitra
Music : Illayaraja
Movie Name: Rudraveena

లలిత ప్రియ కమలం విరిసినదీ
లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినదీ ఊహల జగతిని
ఉదయ రవి కిరణం మెరిసినదీ

అమృత కలశముగ ప్రతి నిమిషం
అమృత కలశముగ ప్రతి నిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినదీ

రేయీ పవలూ కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేలా నింగీ కలిపే బంధం ఇంద్రఛాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళీ
రాగ ఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవనీ
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను

లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినదీ

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజాకుసుమం
మనసు హిమగిరిగ మారినదీ
మనసు హిమగిరిగ మారినదీ
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
హేయమైనది తొలి ప్రాయం
మ్రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడివడి పరువిడి

ఉదయ రవి కిరణం మెరిసినదీ ఊహల జగతిని
లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిని
లలిత ప్రియ కమలం విరిసినదీ

Click for More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top