Manasuna Unnadi – మనసున ఉన్నది

Manasuna Unnadi from Priyamaina Neeku

Song : Manasuna Unnadi – మనసున ఉన్నది 
Lyrics : Sirivennela Sitaramasastri
Singer : K. S. Chithra
Music : Shivashankar
Movie Name: Priyamaina Neeku

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి
సంగతి బయటికి రాదే ఎలా

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో
తెలపకపోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా

చింత నిప్పైనా చల్లగా ఉందని
ఎంత నొప్పైనా తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తియ్యని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో

కనబడుతోందా నా ప్రియాయమైన నీకు
నా ఎద కోత అని అడగాలని
అనుకుంటూ తన చుట్టూ మరి
తిరిగిందని తెలపకపోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా

నీలి కన్నుల్లో అతని బొమ్మని
చూసి నాకింకా చోటెక్కడుందని
నిదరే కసురుకొనే రేయిలో
మెలుకున్నాయి లే వింత కైపని
వేళా ఊహల్లో ఉరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో

వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతే లేదని
తెలపకపోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి
సంగతి బయటికి రాదే ఎలా

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో
తెలపకపోతే ఎలా

Click for More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top