Nee Jathaga – నీ జతగా

Nee Jathaga from Yevadu

Song Name: Nee Jathaga – నీ జతగా
Lyrics: Sirivennela Seetharama Sastry
Singers: Karthik, Shreya Ghoshal
Music: Devi Sri Prasad
Movie: Yevadu

నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్ధం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి

కాళ్లోకొస్తావనుకున్నా
తెల్లార్లు చూస్తూ కూర్చున్న
రాలేదే జాడైన లేదే
రెప్పలా బయటే నేనున్నా
అవి మూస్తే వద్దామనుకున్నా
పాడుకోవేం పైగా తిడతావేం
లోకంలో లేనట్టి మైకంలో నేనుంటే
వదిలేస్తావా నన్నిలా
నీ లోకం నాకంటే ఇంకేదో
ఉందంటే నమ్మే మాటలా
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి

తెలిసి తెలియక వాలింది
నీ నడుంఒంపుల్లో నలిగింది నా చూపు
ఎం చేస్తాం చెప్పు
తోచని తొందర పుడుతుంది
తెగ తుంటరిగా నను నెడుతుంది
నీ వైపు నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో
అనుకుంటూ విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్ని
తరిమేస్తూ ఒకటవ్వాలిగా
నీ జతగా నేనుండాలి
నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి

Click for More

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top