Peniviti – పెనివిటి

Peniviti – పెనివిటి

Peniviti from Aravindha Sametha

Song: Peniviti – పెనివిటి
Lyrics: Ramajogayya Sastry
Singer: Kaala Bhairava
Music: Thaman S
Movie: Aravindha Sametha

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసినా రారా
పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
హే… చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని
సూసీ సూడక సులకన సేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి
హే… తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ
నరగోస తాకే
కామందువే
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో
యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి
హే… నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…

Click for More

SV

Related Posts

Swing Zara – స్వింగ్ జర 

Swing Zara – స్వింగ్ జర  Song : Swing Zara – స్వింగ్ జర Lyrics : Rama Jogayya SastrySinger : Neha Basin, Devi Sri PrasadMusic : Devi Sri PrasadMovie Name: Jai Lava Kusa స్వింగ్…

Yenti Yenti – ఏంటి ఏంటి

Yenti Yenti – ఏంటి ఏంటి Song : Yenti Yenti – ఏంటి ఏంటిLyrics : Sri ManiSinger : ChinmayiMusic : Gopi SundarMovie Name: Geetha Govindam అక్షరం చదవకుండాపుస్తకం పేరు పెటేసానాఅద్భుతం ఎదుటనున్నచూపు తిప్పేసాన అంగుళం నడవకుండాప్రయాణమే చేదు పొమ్మన్నానాఅమృతం…

One thought on “Peniviti – పెనివిటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *