Swapnavenuvedo – స్వప్నవేణువేదో

Swapnavenuvedo from Ravoyi Chandamama

Song: Swapnavenuvedo – స్వప్నవేణువేదో
Lyrics: Veturi Sundararama Murthy
Singers: S.P.Balasubramanyam, Chitra
Music: Mani Sharma
Movie Name: Ravoyi Chandamama

స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేత పూల బాసలు
కాలేవా చేతి రాతలు

స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే

నీవే ప్రాణం నీవే సర్వం
నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమ నేను రేయి పగలు
హారాలల్లే మల్లెలు నీకోసం

కోటి చుక్కలు అష్ట దిక్కులు
నిన్ను చుచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై
చుస్తే నేరాల
కాలలే ఆగిపోయినా
గానాలే మూగబోవునా

నాలో మొహం రేగే దాహం
దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
వోడే పందెం గెలిచే బంధం
రెండు ఒకటే కలిసే జంటల్లో

మనిషి నీడగా మనసు తోడుగా
మల్చుకున్న బంధం
పెను తూఫానులే ఎదురు వచ్చిన
చేరాలి తీరం
వారెవ్వా ప్రేమ పావురం
వాలేదే ప్రణయ గోపురం

స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేత పూల బాసలు
కాలేవా చేతి రాతలు

స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే

Click for More

1 thought on “Swapnavenuvedo – స్వప్నవేణువేదో”

  1. Pingback: Marumallela Vaana – మరుమల్లెలా వాన - Telugupaatalu.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top