Taralirada Thane Vasantham – తరలి రాద తనే వసంతం

Taralirada Thane Vasantham Song from Rudraveena

Song : Taralirada Thane Vasantham – తరలి రాద తనే వసంతం
Lyrics :  Sirivennela Seetharama Sastry
Singer : S. P. Balasubrahmanyam
Music : Illayaraja
Movie Name: Rudraveena

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా
అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతె ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కథ
దిశనెరుగని గమనము కద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

బ్రతుకున లేనీ శృతి కలదా
ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేనీ శృతి కలదా
ఎద సడిలోనే లయ లేదా
ఏ కళ కైనా ఏ కల కైనా
జీవిత రంగం వేదిక కాదా

ప్రజా ధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పారే ఏరే పాడే మరో పదం రాదా

మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలకదు కద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం 

Click for More

1 thought on “Taralirada Thane Vasantham – తరలి రాద తనే వసంతం”

  1. Pingback: Lalitha Priya Kamalam – లలిత ప్రియ కమలం - Telugupaatalu.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top