Tella Tellani Cheera – తెల్ల తెల్లని చీర

Tella Tellani Cheera from Devi Putrudu

Song: Tella Tellani Cheera – తెల్ల తెల్లని చీర
Lyrics: Jonnavitthula
Singers: Udit Narayan, Sujatha
Music: Mani Sharma
Movie: Devi Putrudu

తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తారా
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ

ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల
హంస లలనా చేరుకోనా కోరికల తీరానా
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తలాంగు తోం తోం తోం
ఇంద్రధనస్సు మంచం ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ

ప్రియ వనిత చీర మడత చక్కచేసి ఒక్కటవ్వనా
మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగంలా
రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే
శోభనాల బాలా ముందుంది ఇంక చాలా
జాజులా మజాల పూగంధం పూయాలా

తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందెవేళ
తెల్ల తెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ
తాకితే సితారా శృంగార శుక్ర తారా
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా ఆ ఆ

Click for More

1 thought on “Tella Tellani Cheera – తెల్ల తెల్లని చీర”

  1. Pingback: Neetho Cheppana – నీతో చెప్పనా - Telugupaatalu.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top