Undiporaadhey – ఉండిపోరాదేయ్

Song Name: Undiporaadhey – ఉండిపోరాదేయ్
Movie: Hushaaru
Vocals: Sid Sriram
Music: Radhan
Lyrics: Kittu Vissapragada

ఉండిపోరాదే.. గుండెనీదేలా..
హత్తుకోరాదే.. గుండెకేనన్నే..
అయ్యో.. అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్లీ.. మళ్లీ గాళ్లలో మేఘమై. తేలుతోంది

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే.. గుండెనీదేలా..
హత్తుకోరాదే.. గుండెకేనన్నే.. ఓఓఓఓ

నిసిలో ససిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే

చీకట్లో కూడ నీడలా నీవెంటే నేనుండగా…
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే.. హేఏఏ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top